NUTRITION

Facts About Brown Rice Nutrition

#brownrice #healthtips

ఎందుకు బ్రౌన్ రైస్ తినాలి?
బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే మన శరీరానికి అవసరం అయిన ముఖ్య పోషకాలు అందిస్తుంది. పోషకాల నాణ్యత బ్రౌన్ రైస్ లో ఎక్కువ శాతం లబిస్తాయి. అందువల్ల బ్రౌన్ రైస్ అపారమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనములను కలిగి ఉంది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్థం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు కోల్పోతున్నాము.

బ్రౌన్ రైస్ లోని న్యూట్రీషన్ ఫాక్ట్స్:
బ్రౌన్ రైస్ లో మాంగనీస్, ఇనుము, జింక్, ఫాస్పరస్, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ సంపద విటమిన్ B1 (థయామిన్), విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B3 (నియాసిన్), విటమిన్ B6, విటమిన్ E (ఆల్ఫా- టోకోఫెరోల్) మరియు విటమిన్ K లు ఉన్నాయి. మంచి ఫైబర్ కలిగి ఉండటం దంపుడు బియ్యం యొక్క ప్రత్యేకత.

బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తాయి. అందువలన మధుమేహం ఉన్న వ్యక్తులకు బ్రౌన్ రైస్ మంచి ఆహారం.

దంపుడు బియ్యంలో సెలీనియం ఎక్కువగా ఉండటం వలన ఉబ్బసం వంటి రోగాలతో బాధపడేవారికి దాని తీవ్రతను తగ్గిస్తుంది.

మన శరీర నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా, సక్రమంగా పనిచేయటానికి…ఎముకలు వృద్ధిచెందటాని అవసరం అయిన మెగ్నీషియం ,జింక్ పుష్కలంగా దంపుడు బియ్యంలో లబిస్తాయి.

దంపుడు బియ్యంలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా
శరీర బరువు పెరగకుండ నియంత్రిస్తుంది.

బ్రౌన్ రైస్ రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా తోడ్పడుతుంది. దీనివలన కొలెస్ట్రాల్ అదుపులో ఉండి, గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని చాలావరకు తగ్గిస్తుంది.

ఈ గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్ అడ్డుకోవడంలో సహయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తేలింది.

పాలిచ్చే తల్లులకు బ్రౌన్ రైస్ ఒక వరం…ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు,
ఎక్కువగా ఉంటాయి. దీనివలన పాలు సమృద్ధిగా బిడ్డకు లభిస్తాయి.

బ్రౌన్ రైస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వలన మన శరీరంలో కాన్సర్ కారక కణాలు వృద్ధి చెందకుండా తోడ్పడుతుంది.

బ్రౌన్ రైస్ లో గ్లూటామిన్ మరియు గాబా వంటి కొన్ని ఎమినో ఆసిడ్స్ లభించటం వలన అవి మన మెదడులోని సిరోటినివ్ ఉత్పత్తి ని పెంచి డిప్రెషన్ ని తగ్గిస్తుంది.